నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్
-వధువుకు రు.50,000/- బహుకరణ -ధరాఖాస్తుల ఆహ్వానం
నంద్యాల అర్బన్:నంద్యాల అంజుమన్ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్
తెలిపారు. నంద్యాల అంజుమన్ సంస్థ ముస్లిం సమాజం కోసం పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం విదితమే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో రెండవ విడత పేద ముస్లిం యువతులకు సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నివసిస్తూ అంజుమన్ షాది ఖానాలో సామూహిక వివాహాలు చేయగోరు పేద ముస్లిం వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు ఉన్నవారు దరాఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంజుమన్ షాది ఖానా లో ఉచిత దరాఖాస్తులు పొంది, వధువరుల ఆధార్, రెండేసి పాస్ పోర్ట్ ఫోటోలు, అమ్మాయి బ్యాంక్ పుస్తకం జిరాక్స్ కాపీలు జత చేసి 25, అక్టోబర్ లోపు అంజుమన్ ఆఫీసులో ఇవ్వాలని, సామూహిక వివాహాలు 1, నవంబర్ '26 ఆదివారం ఉంటాయని ఖుద్దూస్ తెలిపారు. పేద తల్లితండ్రులు తమ అమ్మాయిల వివాహాలు అంజుమన్ లో చేసుకోవడానికి ముందుకు రావాలని, నిఖా ఖర్చులు భరించి వధువుకు రూ.50,000/- నగదు చెక్కు వివాహం రోజే బహూకరించునున్నట్లు అంజుమన్ అధ్యక్షులు ఖుద్దూస్ తెలిపారు.