BREAKING
ఇటలీలో బద్ధలైన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రమదానం రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

Select Suryaa Now
వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన

కోరుకొండ, మేజర్ న్యూస్ : మండలంలోని గాదరాడ–కనుపూరు గ్రామాల మధ్య చింతలగండి కాలువ వరద ఉధృతికి గురువారం రాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

కనుపూరు గ్రామానికి చెందిన కరణం సతీష్ మరో ముగ్గురితో కలిసి గురువారం రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాలువలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. కొంతదూరం వెళ్లిన అనంతరం కారులో ఉన్న నలుగురూ తీవ్రంగా శ్రమించి డోర్లు తెరుచుకుని బయటకు వచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

కారు మునిగిన ప్రాంతంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతు నీరు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే అక్కడ గట్టు కాస్త ఎత్తుగా ఉండటంతో నలుగురూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు చెప్పారు.

ఈ ఘటనతో చింతలగండి కాలువపై కల్వర్టు నిర్మాణం అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు చింతలగండి కాలువ వద్ద ధర్నా నిర్వహించారు. కల్వర్టును వెంటనే నిర్మించాలని నినాదాలు చేశారు. వర్షాకాలంలో కాలువ ఉధృతంగా ప్రవహించే సమయంలో రైతులు పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదకరమని తెలిసినా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో రైతులు వరద నీటిలోనే ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగించాల్సి వస్తోందని తెలిపారు. కనుపూరు, కలవచర్ల, సీతారాంపురం, గాదరాడ గ్రామాలకు చెందిన ప్రజలు ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోందని స్థానికులు పేర్కొన్నారు.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామమైన గాదరాడలో ప్రమాదకరంగా ఉన్న చింతలగండి కాలువపై కల్వర్టు నిర్మాణంపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టి సారించలేదంటూ వారు విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చింతలగండి కాలువపై కల్వర్టు నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని, మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఆందోళనలో వైఎస్సార్‌సీపీ నాయకులు తోరాటి శ్రీనివాస్, చీర్ల రాంబాబు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, వరద నీటిలో కొట్టుకుపోయిన కారును గజ ఈతగాళ్ల సహాయంతో జేసీబీ ద్వారా వెలికితీశారు. కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలువకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.