BREAKING
ఇటలీలో బద్ధలైన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రమదానం రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే!

Select Suryaa Now
నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే!

 

ఎమ్మెల్యే పదవిని ప్రజలకు అంకితం చేశా,
ప్రజాక్షేత్రాన్ని వీడలేదు:

● ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

సూర్య కోనరావుపేట

ఎన్నికల్లో నాలుగుసార్లు ఓటమి ఎదురైనా ప్రజాక్షేత్రాన్ని వీడలేదని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడానని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చివరకు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, పదవిని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  సీఎం రేవంత్‌రెడ్డి బారీ బహిరంగ సభ  సన్నాహక సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ప్రజలకు దూరంగా వెళ్లడం తన నైజం కాదన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి మధ్యే ఉన్నానని చెప్పారు.ఎమ్మెల్యేగా గెలిచిన రోజే పదవిని ప్రజలకు అంకితం చేశా. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.
కోనరావుపేట ప్రాంతం నుంచి ఎదిగిన పలువురు నాయకులు గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు. జూనియర్‌, మూలవాగు, పెంటవాగులపై వంతెనల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల విషయంలో గతంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. ప్రస్తుతం అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

సిరిసిల్లలో ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి సభను విజయవంతం చేయాలని సూచించారు.