నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25): పరిగి పట్టణంలోని నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం స్థానిక డీఎస్పీ శ్రీనివాస్ తో కలిసి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (ఎస్ఐఆర్) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గతంలో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయంలోకి మార్చడం జరిగిందన్నారు. శాశ్వత డీఎస్పీ భవనం నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ను కేటాయించడం జరిగిందన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా ఇక్కడే డీఎస్పీ కార్యయం ఉండనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్, వైస్ చైర్మన్ కమల్, పరిగి సిఐ కొండల్ రెడ్డి, కొడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పరిగి డివిజనల్ లోని ఎస్సైలు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రిపోర్టర్ మంగలి ప్రకాష్ కుమార్