ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం
ఆర్థిక వివాదంతో ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం
ఆరుగురు అదుపులో.. రూ.5 లక్షలకు హత్యకు కుట్ర
భీమవరం మేజర్ న్యూస్: ఆర్థిక, ఆస్తి వివాదంతో ఉపాధ్యాయుడు చేదాబర్తుల వెంకట రత్నం (57)పై హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెదమిరం గ్రామానికి చెందిన వెంకట రత్నం ఉండి NRP అగ్రహారం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
బొండడకు చెందిన మందపాటి కృష్ణమూర్తి వద్ద వెంకట రత్నం రూ.65 లక్షలు తీసుకోవాల్సి ఉండగా, ఆస్తి వివాదం నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు అడిషనల్ ఎస్పీ విశ్వనాథ్ భీమవరం డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలిపారు. కృష్ణమూర్తి, అతని ఇద్దరు కుమారులు మరో ముగ్గురితో కలిసి రూ.5 లక్షలకు హత్య చేయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 21న సైకిల్‌పై వెళ్తున్న వెంకట రత్నంపై ఓ బాలుడు స్టీల్ రాడ్‌తో దాడి చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 25న బొండడ డంపింగ్ యార్డ్ వద్ద A-1 నుంచి A-5 నిందితులతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, స్ప్లెండర్ బైక్, స్టీల్ రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో, బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు.విలేకరుల సమావేశం లో భీమవరం ఇన్ ఛార్జి డిఎస్పీ ఎం. సుధాకర్, ఆకివీడు సిఐ జి. కాశీ చరణ్, కాళ్ల ఎస్సై ఎ. గణేష్ కుమార్, ఆకివీడు ఎస్సై కె. శుభ శేఖర్, ఉండి ఎస్సై హెచ్. మల్లికార్జున రావులు పాల్గొన్నారు.