BREAKING
ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు ఆమనగల్లులో అదనపు కోర్టు వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే!

సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా

Select Suryaa Now
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా

 

● కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ
●30న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి.
౼ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

 

 సూర్య కోనరావుపేట


పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను శుక్రవారం ఆయన లబ్దిదారులకు     పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఆపదలో ఉన్న నిరు పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం అందించడం, ఆడపడుచుల వివాహాలకు కల్యాణ లక్ష్మీ ద్వారా చేయూతనివ్వడం జరుగుతోందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం సభకు భారీగా తరలిరావాలి

ఈ నెల 30న నిర్వహించనున్న సీఎం  బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా గ్రామాల వారీగా సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని కోరారు.ఈ
కార్యక్రమంలో  గ్రంధాలయం ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,తహశీల్దార్ వరలక్ష్మి,
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్ రెడ్డి,ప్యాక్స్ చైర్మన్లు బొమ్మేన భాస్కర్ రావు,చేపూరి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, మార్కెట్ డైరెక్టర్లు, ప్యాక్స్ డైరెక్టర్లు ,వివిధ గ్రామాల సర్పంచులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.