BREAKING
ఇటలీలో బద్ధలైన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం వల్లూరులో ఘనంగా సేవా పక్షోత్సవం పరిశుభ్రతపై.. పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల అవగాహన మదర్ తెరిసా ట్రస్ట్ సహకారంతో.. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శ్రమదానం రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం

రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం

-సీనియర్ మెన్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నంద్యాల జిల్లా జట్టు

-క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత గుర్తింపు తేవాలని మంత్రి ఫరూక్ ఆకాంక్ష

నంద్యాల అర్బన్:
రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్‌బాల్ (పురుషుల) పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని, బంగారు పతకాన్ని సాధించిన నంద్యాల జిల్లా జట్టు సభ్యులను నంద్యాల మంత్రి క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా విజేతలైన క్రీడాకారులను మంత్రి ఫరూక్ శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. క్రీడాకారులు నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి తన ఆశీస్సులు అందజేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఏపీఈ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, జిల్లా బేస్‌బాల్ గౌరవ సలహాదారు చలం బాబు , జిల్లాల బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శులు సుబ్బయ్య, రమణయ్య, నంద్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరేష్ నాయుడు, మాజీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ తో పాటు ఇతర నాయకులు, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.