BREAKING
ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....

కూటమి పాలనతోనే అభివృద్ధి

Select Suryaa Now
కూటమి పాలనతోనే అభివృద్ధి

కూటమి పాలన తోనే అభివృద్ధి.. ఎంపీ, ఎమ్మెల్యే


ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

కూటమి పాలన తోనే అభివృధి సాధ్యం అవుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి లు పేర్కొన్నారు. నందవరం మండలంలో టీ.సోమలగూడూరు, గోనెగండ్ల మండలంలో పుట్టపాశం  గ్రామంలో శుక్రవారం పలు అభివృధి పనులకు భూమి పూజ చేపట్టారు.
ముందుగా నూతన స్వర్ణ గ్రామ సచివాలయాన్ని, మిట్టసోమాపురం రోడ్డులో ఎంపీపీఎస్ పాఠశాల నూతన తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం జుమ్మా మసీదు, శ్రీ బీరప్ప స్వామి ఆలయాలను సందర్శించి ప్రార్థనలు, పూజలు నిర్వహించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎస్సీ కాలనీ రోడ్డు, , మఠం రోడ్డు ప్రాంతాల్లో భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ గ్రామంలో తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, ముఖ్యమంత్రి సహాయనిధి తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే రూ.1.40 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టామని, గ్రామానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పుట్టపాశం గ్రామానికి 30 లక్షల రూపాయలు కేటాయించి నట్టు వెల్లడించారు.
కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.