BREAKING
రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ

ఆమనగల్లులో అదనపు కోర్టు

Select Suryaa Now
ఆమనగల్లులో అదనపు కోర్టు

 ఆమనగల్లు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25) : ఆమనగల్లు కోర్టుకు నూతనంగా అదనపు కోర్టును కేటాయిస్తూ ప్రభుత్వం, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయమని ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ అవసరాలను గుర్తించి అదనపు కోర్టు మంజూరు  పట్ల చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆమనగల్లు బార్ అసోసియేషన్  న్యాయవాదుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదనపు కోర్టు కోసం కృషి చేసిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.  నూతన కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు దూరం - భారం తప్పడంతో పాటు సత్వర న్యాయం జరుగుతుందని ఆయన  ఆశాభావం వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : ఏ.చంద్రశేఖర్