BREAKING
సీఎం రేవంత్‌కు ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ సభ విజయవంతానికి కాంగ్రెస్ సన్నాహక సమావేశం.. బలహీనపడిన తీవ్ర వాయుగుండం దుర్గ గుడి ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం వివేకా హత్య కేసు: సునీల్‌ యాదవ్‌ను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ ఉప ఎన్నికల వేళ డీఎంకేపై సీఎం విజయ్‌ తీవ్ర విమర్శలు రిమ్స్ బాధితులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటాయి అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి నాగలదిన్నెలో ఎన్ ఆర్ ఎల్ ఎం బృందం పర్యటన ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు ఆమనగల్లులో అదనపు కోర్టు

నాగలదిన్నెలో ఎన్ ఆర్ ఎల్ ఎం బృందం పర్యటన

Select Suryaa Now
నాగలదిన్నెలో ఎన్ ఆర్ ఎల్ ఎం బృందం పర్యటన

నాగలదిన్నెలో ఎన్ ఆర్ ఎల్ ఎం బృందం పర్యటన

.. చేనేత కార్మికుల సమస్యలపై ఆరా..

.. సుస్థిర ఆదాయంపై దృష్టి

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ బృందం నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామంలో శుక్రవారం పర్యటించింది. గ్రామంలోని పొదుపు సంఘాల మహిళా చేనేత కార్మికులతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత వృత్తి ద్వారా లభిస్తున్న ఆదాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అనాదిగా చేనేత వృత్తినే జీవనోపాధిగా కొనసాగిస్తున్న మహిళల ఇబ్బందులను  బృందం సభ్యులు తెలుసుకున్నారు. చేనేత రంగంలో మరింత ఆదాయం పొందేందుకు తమ నుంచి ఎలాంటి సహకారం అవసరమో మహిళలను అడిగి తెలుసుకున్నారు. అలాగే చేనేత వృత్తిపై ఆధారపడిన మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించే దిశగా కామన్ ఫెసిలిటీ సెంటర్‌  ఏర్పాటు చేసేందుకు గ్రామంలోని అనుకూల పరిస్థితులను పరిశీలించారు.
గ్రామంలోని పొదుపు మహిళా చేనేత కార్మికులతో పాటు మాస్టర్‌ వీవర్లతో కూడా బృందం సభ్యులు చర్చించి, చేనేత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌, ఆదాయాభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో  బృందం సభ్యులు నీలేందు ముఖర్జీ, గౌతమ్ మజుందార్, విజయవాడ సెర్ప్ నాన్‌ఫార్మ్‌ పి ఈ కుమారస్వామి, ఎంబల్ డిజైనర్‌ హరిగోపాల్, ఎఫ్ ఈ ప్రకాశ్, నందవరం మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి లక్ష్మి, ఏపీఎం రాఘవేంద్ర, సీసీ  సభ్యులు వసుంధర, ముక్కన్న, మల్లేష్, చెన్నమ్మ, వి ఓ ఏ లు శేఖర్, మునీర్ తదితరులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.