BREAKING
ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన నీట మునిగిన మున్సిపల్ పార్క్ కిరాయి బకాయిలతో ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం 18 నెలలుగా రూ.15 లక్షల బకాయిలు: యజమాని కర్నాటి కృష్ణ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అకాలo గా మృతి చెందిన కాకర్లముడి కుటుంబానికి బొల్లి శెట్టి లక్ష రూపాయల సాయం మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్ డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా

వివేకా హత్య కేసు: సునీల్‌ యాదవ్‌ను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

Select Suryaa Now
వివేకా హత్య కేసు: సునీల్‌ యాదవ్‌ను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీల్‌ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారించింది. రెండో రోజు కొనసాగిన విచారణలో సుమారు నాలుగు గంటలపాటు సునీల్‌ యాదవ్‌ను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్‌రెడ్డితో సునీల్‌ యాదవ్‌కు ఉన్న ఫోన్‌ కాల్స్‌పై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయా కాల్స్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించిన అధికారులు, వాటిపై సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.

అలాగే గూగుల్‌ టేక్‌అవుట్‌ వివరాలను సునీల్‌ యాదవ్‌ ముందు ఉంచి ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.

వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని సునీల్‌ యాదవ్‌ ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ కాల్‌ డేటా, డిజిటల్‌ ఆధారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో సునీల్‌ యాదవ్‌ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.