బలహీనపడిన తీవ్ర వాయుగుండం
తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలపై వాయుగుండంగా కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.