BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ

Select Suryaa Now
టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ

*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ*
       
*పత్రికా ప్రకటన*

*Date : 12.10.2026*


 

ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా అదనపు బస్సు సర్వీసులు

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : అధికారులకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాలు

తొలి 3 రోజుల్లోనే  కోటి నలభై లక్షల మంది ప్రయాణం

దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) నడుపుతున్న ప్రత్యేక బస్సు సర్వీసులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దసరా పండుగ రద్దీ నిర్వహణ మరియు అదనపు బస్సుల ఆపరేషన్లపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సోమవారం అధికారులతో జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో సర్వీసులను నడుపుతూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించింది. గత ఏడాది (2025) దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడపగా... ఈ ఏడాది అక్టోబర్ 9, 10, 11 తేదీలలో గతంతో పోలిస్తే 495 బస్సులు అదనంగా, అంటే మొత్తం 1,417 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు...
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా దసరా పండుగ వేళ మహిళలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గత ఏడాది దసరా సమయంలో రోజుకు సగటున రూ. 13.02 కోట్లు ఆదా కాగా, ఈ ఏడాది దసరా రద్దీ సమయంలో మహిళలు రోజుకు రూ. 13.73 కోట్ల మేర ఆదా చేసుకోగలిగారు.
పండుగ ముందు రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వంత ఊర్లకు  ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని అధికారులను ఎండీ వై. నాగిరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ మరియు ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని, ఇతర వివరాలు మరియు ప్రయాణ సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించారు.

• *పీఆర్ఓ, టీజీఎస్ ఆర్టీసీ.*