టైగర్ జోన్ రద్దు కోసం మద్దతు తెలిపిన ట్రాక్టర్ డ్రైవర్ అసోసియేషన్
సూర్య, జన్నారం : జన్నారం మండలంలో జరుగుతున్న 40వ రోజు దీక్షకు కామనపల్లి, దేవునిగూడ, చర్లపల్లి ట్రాక్టర్ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఈ దీక్షకు అందరూ సహకరించాలని, భూమాచారితో కలిసి మండల ప్రజలంతా కలిసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.