పాపమ్మ గుడి నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాళ్లసింగారం గ్రామంలోని పాపమ్మ గుడి నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఒకటో వార్డు కౌన్సిలర్ కోసనం రాకేష్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సుర్వి నరసింహగౌడ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.