పిఎం సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం ప్రత్యేక సేవా సేతు శిబిరాలు
*నారాయణపేట, సూర్యన్యూస్ :* పిఎం సూర్య ఘర్ మూప్త్ బిజ్లీ యోజన పథకానికి అర్హులైన లబ్ధిదారులు ఈ పథకంలో భాగస్వాములు అయ్యేందుకు నారాయణపేట జిల్లా కేంద్రంలో మూడు రోజులు సేవా సేతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక టేక్నికల్ డిఈ రాజు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ శిబిరంలో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునే వేసులుబాటు కల్పించనున్నారు. కావున నారాయణపేట జిల్లా ప్రజలు, వివిధ మండలాల్లో అర్హులైన లబ్ధిదారులు ఈ శిబిరానికి వచ్చి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో సంబంధిత బ్యాంకు అధికారులు సైతం అందుబాటులో ఉంటారని చెప్పారు. టిజీ రేడ్కో తో పాటు భారత ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో టీజీ రేడ్కో జిల్లా యంత్రాంగం, పరిపాలన విభాగాల అధికారులు, బ్యాంకు అధికారులు ఎంప్యానేల్డ్ వెండర్లతో సమన్వయం చేసుకొని డివిజన్ స్థాయిలో నిర్వహించే సేవా సేతు శిబిరంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కోసం అర్హులైన లబ్ధిదాలను ఎంపిక చేసేందుకు అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుందని తెలిపారు. కావున అర్హులైన లబ్ధిదారులు ఈ శిబిరానికి వచ్చి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
*రాజేష్ కుమార్, సూర్య న్యూస్ నారాయణపేట*