BREAKING
వర్ష బాధితులకు ‘సత్యసాయి ట్రస్ట్’ అండ - రేషన్ పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని వినతి సత్యం, అహింస, సేవా మార్గంలో మనమందరం ముందుకు సాగుదాం. గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* అనకాపల్లిలో తమ డిమాండ్లతో హోమ్ మినిస్టర్ కు వినతి పత్రం అందించిన విలేఖరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం.

Select Suryaa Now
నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు       గాంధీ విగ్రహానికి వినతి పత్రం.

నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్.     కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి రామగిరి లో  గాంధీ విగ్రహానికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టు లకు భద్రత కల్పించడం కోసం జాతీయ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నల్గొండ నగర పంచాయతీ తో పాటు తో పాటు అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు హెల్త్ కార్డులు ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేంద్ర రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి దూటి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు మాదరి యాదగిరి,మదనాచారి, పిట్టల రామకృష్ణ, వగాల శ్రీనివాస్ రెడ్డి, ఊర రమేష్, గంగాధర వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, దశరథ, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు