మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
సూర్య రెంజల్ : జాతిపిత, మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి వేడుకలను రెంజల్ మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామాలలో ప్రధాన కూడలిలా వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహాలకు మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి సర్పంచులు ధనుంజయ్, గియాసోద్దీన్, యోగేష్, భానుచందర్, సువాసిని, ఆవులసవిత, మల్లేష్, విజయ్, జ్యోతి, తెలంగాణ శంకర్, అశోక్,ధనూరి నరసవ్వ,మధుకర్,విజయ్, మాధవి,తిరుపతి లలిత లు నివాళులు అర్పించారు. గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పితామహుడు చూపించిన మార్గంలో నడిచినప్పుడే దేశ ప్రగతి మరింత సాధ్యమవుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపసర్పంచులు, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.