BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Select Suryaa Now
రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

- కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

- వందల ఎకరాల్లో దెబ్బతిన్న అరటి పంటలు పరిశీలన

వేంపల్లె మేజర్ న్యూస్:;ఈదురు గాలులు, వడగండ్ల వానకి  నెలమట్టమైన అరటితో పాటు ఆయా పంటలు సాగు చేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని బక్కనగారిపల్లి, వెలమవారిపల్లి, కుప్పాలపల్లి, తాళ్లపల్లి గ్రామాల్లోని అరటి పంటలను ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి భరోసానిచ్చారు. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అరటికి పెట్టుబడి పెట్టామని, అకాల ఈదురు గాలులు, వడగండ్ల వానకి తమ పంట పూర్తిగా నెలమట్టమై భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వారంలో పంట విక్రయించే సమయంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, వడగండ్ల వానకి సూమారు వందల ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లిందని, దీంతో తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు కనీసం రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పంటబీమా, ఇన్పుట్ సబ్సిడీని ఆలస్యం చేయకుండా పంట నష్టపోయిన రైతులకు అందించి ఆదుకోవాలని కోరారు. ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైసిపి నాయకులు రవికుమార్ రెడ్డి, చంద్రఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.