బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
విజయనగరం, అక్టోబర్ 2 , మేజర్ న్యూస్:
33 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున చెప్పారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం జరుగుతుందని, బీసీ లకు అండగా ఉంటూ వారి కోసం పోరాటం చేస్తున్న పార్టీ తెలుగుదేశమని నాగార్జున అన్నారు.