BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్

Select Suryaa Now
హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్

గాల్లో ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని రీతిలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడి నుంచి సమయస్ఫూర్తితో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు 11 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. విమానం నడిపిస్తున్న సమయంలో కో-పైలట్ ఒక్కసారిగా తనపై కత్తితో దాడి చేసి విమానాన్ని వేగంగా కిందకు పడేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. తీవ్ర గాయాలై రక్తం ఓడుతున్నప్పటికీ, ఆ భగవంతుడే ధైర్యాన్ని ఇచ్చాడని, ఆ క్లిష్ట సమయంలో తాను నిరంతరం 'హనుమాన్ చాలీసా' పఠిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.

ఆకాశంలో దాదాపు 34,000 అడుగుల ఎత్తు నుంచి విమానం ఒక్కసారిగా కిందకు దిగజారడం గమనించిన స్మిత్, ప్రయాణికులందరూ చనిపోతారేమోనన్న భయంతో అచేతన స్థితిలోకి వెళ్లకుండా ప్రాణాలను పణంగా పెట్టి కాక్‌పిట్ తలుపులను తెరిచారు. ఆ క్షణంలోనే స్పందించిన కేబిన్ సిబ్బంది, కొందరు ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలట్‌ను బంధించగా, విమానంలో ఉన్న మరికొందరు పైలట్ల సాయంతో కాక్‌పిట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుని సౌదీ అరేబియాలోని ఎమర్జెన్సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఆపదలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రమాదాన్ని తప్పించిన స్మిత్ మచ్చర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు.