BREAKING
ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట టాటా సన్స్ బోర్డులో వివాదం, చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సమావేశం వీడియో, మినిట్స్ కోరిన నోయెల్ టాటా శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూడూర్‌లో వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీ చేవెళ్లలో 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు రామేశ్వరం విమానాశ్రయానికి కేంద్రం అనుమతి కోరనున్న తమిళనాడు ప్రభుత్వం వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సిరమ్మ అభినందనలు ఆత్మహత్య చేసుకున్న రైతు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, తప్పుదారి పట్టించే ప్రచారమంటూ బెంగాల్, బీహార్ బీజేపీ నేతల విమర్శలు

ఫ్లై దుబాయ్ ఘటనపై ట్రంప్ స్పందన

Select Suryaa Now
ఫ్లై దుబాయ్ ఘటనపై ట్రంప్ స్పందన

వాషింగ్టన్:‘ఫ్లై దుబాయ్’ FZ1073 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంలో ఇరాన్ ప్రమేయం ఉండవచ్చనే బలమైన అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. విమానాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు యత్నించిన ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్‌కు ఇరాన్ ప్రభుత్వంతో లేదా అక్కడి సంస్థలతో సంబంధాలు ఉండి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఇరాన్ హస్తం ఉన్నట్లు ఆధారాలతో తేలితే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది పూర్తిస్థాయి విచారణలోనే వెల్లడికావాల్సి ఉందన్నారు. కాగా, తీవ్రంగా గాయపడినప్పటికీ భారతీయ కెప్టెన్ ఎంతో సాహసంతో కాక్‌పిట్ తలుపులు తెరిచి ప్రయాణికుల సాయంతో కో-పైలట్‌ను బంధించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి.