BREAKING
చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభo బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర

పూడూర్‌లో వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీ

Select Suryaa Now
పూడూర్‌లో వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీ

స్మశానవాటిక వద్ద నిలిపి ఉంచిన ట్యాంకర్‌ నుంచి అపహరణ.. నిఘాపై స్థానికుల ఆందోళన

మేడ్చల్, మేజర్ న్యూస్,(అక్టోబర్ 3):
పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూర్ గ్రామంలో వాటర్ ట్యాంకర్‌కు చెందిన రెండు టైర్లు చోరీకి గురయ్యాయి. గ్రామంలోని స్మశానవాటిక వద్ద నిలిపి ఉంచిన వాటర్ ట్యాంకర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు టైర్లను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.వాటర్ ట్యాంకర్‌కు టైర్లు కనిపించకపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు తాగునీటి సరఫరాలో ఉపయోగించే వాటర్ ట్యాంకర్‌ టైర్లు చోరీ కావడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్మశానవాటిక పరిసరాల్లో రాత్రివేళల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చోరీ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్మశానవాటిక పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్ తలారి శివకుమార్.