BREAKING
ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం.. మోకాలి గాయం నుంచి కోలుకుని ముంబై ఈవెంట్‌లో మెరిసిన అమితాబ్ బచ్చన్.. అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ హనుమాన్ చాలీసా చదువుతూ ప్రాణాలు కాపాడిన పైలట్.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభo బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి

అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం

నెల్లూరు, మేజర్ న్యూస్: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పాత 16వ డివిజన్‌–ప్రస్తుత 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతి గడపను పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న నాయకులు.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న పాలన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి పొంగూరు నారాయణ చేస్తున్న కృషిని ప్రస్తావించారు.  స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని జనసేన నాయకులు తెలిపారు. 21వ డివిజన్‌లో నగర మౌలిక వసతులు మరింత మెరుగుపడేలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  రానున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, కుమారి, ప్రవళ్లిక, విజయ, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, ఇశాక్, సుప్రియ, కల్పన, లక్ష్మి, నరహరి తదితరులు పాల్గొన్నారు.