వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సిరమ్మ అభినందనలు
విజయనగరం, అక్టోబర్ 3 మేజర్ న్యూస్:
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన జోనల్/రీజినల్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో సెంచూరియన్ యూనివర్సిటీ తరఫున పాల్గొన్న వకీల్ సహస్ర, వాల్సన్ మౌనిక, శ్రీపాద శ్రీజలు జూనియర్, సీనియర్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. అదే విధంగా ఆదినారాయణ బట్టు ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ స్థాయి పతకాన్ని సాధించారు.
తమ విజయాల అనంతరం క్రీడాకారులు, కోచ్ అర్జున్ ఆధ్వర్యంలో గౌరవ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు.
క్రీడాకారుల విజయాలను తెలుసుకున్న * సిరమ్మ వారిని అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల విజయాల్లో కోచ్ అర్జున్ అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని కూడా ఆమె అభినందించారు.