ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన
సూర్య బిక్కనూర్ :మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, శనివారం మండల బిఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. వెంటనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండల కేంద్రానికి మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాలు చేసి, ఇతర మండలానికి పాఠశాల తరలి వెళ్లిన పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాఠశాలను మండల కేంద్రంలో నిర్మించాలని, లేనిచో తమ పదవులకు రాజీనామా చేసి మండల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్, పార్టీ నాయకులు అందే మహేందర్ రెడ్డి, భూమ్ రెడ్డి, తునికి వేణు, మధు మోహన్ రెడ్డి, సాయి రెడ్డి, కోడూరి సాయ గౌడ్ మహిళ మండల అధ్యక్షురాలు దేవర లక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రం, సరస్వతి ప్రభాకర్, బోడ నరేష్, బుర్రి గోపాల్, మద్ది స్వామి, తక్కల్ల మధు, యూత్ నాయకులు రంజిత్ వర్మ, రాకేష్ రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు