BREAKING
ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం.. మోకాలి గాయం నుంచి కోలుకుని ముంబై ఈవెంట్‌లో మెరిసిన అమితాబ్ బచ్చన్.. అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ హనుమాన్ చాలీసా చదువుతూ ప్రాణాలు కాపాడిన పైలట్.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభo బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి

Select Suryaa Now
శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి

శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుడు ఘటనపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వస్తున్న ప్రాథమిక సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. పరిశ్రమలో నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు కూడా ప్రమాద సమయంలో అక్కడే ఉన్నట్లు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎంపీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అత్యున్నత వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అవసరమైన సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి