శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీసిటీలో జరిగిన ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారు త్వరగా కోలుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.