మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట
- అభినందించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
మదనపల్లె : తిరుపతి నగరంలో సెప్టెంబర్ 30వ తేదీ జరిగిన జిల్లా తైక్వాండో పోటీలలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,నీరుగట్టువారిపల్లె,సాయిరాం స్ట్రీట్ సెకండ్ క్రాస్ పరిధిలో గల జెపి తైక్వాండో అకాడమీ విద్యార్థులు పతకాల పంట పండించారు.ఇందులో ఆర్.హర్ష,ఎస్.మధుసాయి,ఎం.హిత్విక్,కే.కావ్య,కే.వన్షిక రెడ్డి,పి.మల్లీశ్వరి,సి.విశ్వ,ఎన్.సాత్విక్,వి.ఉదయ్ కిరణ్ అనే విద్యార్థులు బంగారు పతకాలు కైవసం చేసుకోగా,ఎస్.గీతిక,సి.మాన్య,సి.వరుణ్ కార్తీక్,కే.లాస్య,కే.కార్తీక రెడ్డి,సి.విశ్వసాయి తేజ,వి.మహిధర్,ఇమ్రాన్,హర్ష అనే విద్యార్థులు సిల్వర్,బ్రాంజ్ పతకాలు సాధించారు.ఈ సందర్భంగా శనివారం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ జెపి తైక్వాండో అకాడమీ కోచ్ పి.విఘ్నేష్ శిక్షణలో విద్యార్థులు మొత్తం 18 పతకాలు కైవసం చేసుకోవడం అకాడమీకి,మదనపల్లి పట్టణానికి,జిల్లాకే గర్వకారణమన్నారు.విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ,అక్టోబర్ 12,13 తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో అద్భుత విజయాలు అందుకోవాలని శ్రీరామ్ చినబాబు ఆకాంక్షించారు.క్రీడలు,క్రీడాకారులకు తమకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో శ్రీరామ్ చినబాబుకి విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.