BREAKING
అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పింక్ మారథాన్ ర్యాలీ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం.. మోకాలి గాయం నుంచి కోలుకుని ముంబై ఈవెంట్‌లో మెరిసిన అమితాబ్ బచ్చన్.. అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ హనుమాన్ చాలీసా చదువుతూ ప్రాణాలు కాపాడిన పైలట్.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు

కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ

Select Suryaa Now
కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ

చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో శనివారం విద్యుత్ సదుపాయాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 63 కేవీ సామర్థ్యం గల రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభించడంతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, ఇకపై విద్యుత్ కోతలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు నడిమెల్ల లవణ్య శంకర్, వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు బండారి శైలజ ఆగిరెడ్డి, మూడవత్ కృష్ణ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బి. రాములు, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గిరిధర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల ప్రభాకర్, టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, నడిమొళ్ళ మహేందర్, మాజీ డైరెక్టర్ బుర్ల మహేష్, విద్యుత్ శాఖ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

 

(చేవెళ్ల - మేజర్ న్యూస్)