BREAKING
ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం.. మోకాలి గాయం నుంచి కోలుకుని ముంబై ఈవెంట్‌లో మెరిసిన అమితాబ్ బచ్చన్.. అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ హనుమాన్ చాలీసా చదువుతూ ప్రాణాలు కాపాడిన పైలట్.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం దారుణ హత్యకు దారితీసింది: మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్యాధికారిణి సృజన దారుణ హత్య సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభo బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి

భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర

Select Suryaa Now
భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర

భద్రాచలం, సూర్య ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకోనున్న సందర్భంగా తలపెట్టిన 'సేవా సంకల్ప యాత్ర' శనివారం భద్రాచలానికి చేరుకోనుంది. ప్రధాని మోదీ అందించిన విశేష సేవలకు సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ బైక్ యాత్రకు స్థానిక నాయకులు, బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నారు.

భద్రాచలం చేరుకున్న అనంతరం యాత్రికులు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భద్రాచలం మీదుగా ఆధ్యాత్మిక నగరం వారణాసి (కాశీ) వైపుగా సాగనుంది.

షెడ్యూల్ ప్రకారం ఈ సేవా సంకల్ప యాత్ర ఈ నెల 6వ తేదీన వారణాసికి చేరుకోనుంది. అనంతరం ప్రధాని మోదీ రాజకీయ, ప్రజాసేవారంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకునే ఆశ్వయుజ బహుళ విదియ (అక్టోబరు 7) సందర్భంగా ఈ నెల 7న వారణాసిలోని కాశీ విశ్వనాథునికి ప్రత్యేక అభిషేకం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.