పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు
నందివాడ, అక్టోబర్ 2, మేజర్ న్యూస్, ప్రతినిధి : నందివాడ మండలం పోలుకొండలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ఆవరణలోని గాంధీ చిత్రపటానికి గ్రామ ప్రత్యేకాధికారి, డీటీ గిరికిశోర్, పంచాయతీ కార్యదర్శి విమలకుమారి, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, శాంతి, సహనం, వంటి విలువలను గాంధీజీ దేశానికి అందించారని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందిస్తూ సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించి గ్రామ సమస్యలు, గ్రామ అవసరాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయ, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.