BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

నాటి యువగళం హామీ...నేడు నెరవేరింది ఇలా!

Select Suryaa Now
నాటి యువగళం హామీ...నేడు నెరవేరింది ఇలా!

*పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన లోకేష్*

*కడప వేదికగా నాడు మిషన్ రాయలసీమ ప్రకటన*

*నేడు మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం*

*ప్రపంచానికి ఫ్రూట్ బౌల్ గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్*

ఏపీ సూర్య, స్టేట్ బ్యూరో : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరే ఇతర నాయకుడు చేయని విధంగా యువనేత నారా లోకేష్ రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అ సమయంలో లక్షలాది మంది రాయలసీమ రైతులను నేరుగా కలిసి, వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తానని ఆనాడు సీమ రైతాంగానికి భరోసా ఇచ్చారు. పాదయాత్ర 119వ రోజున 2023 జూన్ 7న  కడప వేదికగా మిషన్ రాయలసీమను ప్రకటించారు. హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమను మారుస్తామని, సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీనీ, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని, 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తామని తెలిపారు. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ పోర్టు చేసే విధంగా కొత్తరకం విత్తనాలు, మొక్కలు సృష్టించేందుకు హార్టికల్చర్ రీసెర్చి సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనాడు ప్రకటించారు. సీడ్ హబ్ గా 

ఏపీని మార్చడం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నాడు రైతులకు హామీ ఇచ్చారు.  

యువగళం పాదయాత్ర సందర్భంగా ఆనాడు రాయలసీమ రైతాంగానికి యువనేత లోకేష్ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఈరోజు సాకారం చేసింది. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌-GHHకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు వెచ్చిస్తుంది. ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీడ్ టు షిప్ మెంట్ విధానంలో ఉద్యాన రైతులకు అండగా నిలిచేలా ప్రతిష్టాత్మక GHH కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఉద్యాన రైతులకు మేలు కలిగేలా  పెద్ద ఎత్తున సాగునీరు, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం చేపడుతుంది. రహదారులు, లాజిస్టిక్స్ అభివృద్ధి పనులకూ GHHలో ప్రాధాన్యత ఇస్తారు. 

వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, ఇరిగేషన్ సహా వివిధ కీలక శాఖలతో వరుస సమీక్షలపాటు ముఖ్యమంత్రి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. రాయలసీమ పరిస్థితులను అర్థం చేసుకుని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు నిధులు సమకూర్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనిద్వారా ఉద్యాన సాగు విస్తరణ, పంట దిగుబడి మొదలుకుని ఎగుమతుల వరకు జరిగే వివిధ ప్రక్రియలను బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ దేశానికే కాక ప్రపంచానికే "ఫ్రూట్ బౌల్" గా మారుతుంది. ఉద్యానవన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించడంలో కీలక చోదక శక్తిగా నిలుస్తుంది. ఒకప్పుడు కరువుకు పర్యాయపదంగా ఉన్న రాయలసీమ, మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ఉద్యాన పంటలలో దేశంలోనే అగ్రగామిగా నిలవబోతుంది.

******