BREAKING
గాంధీ ఆశయాలే ప్రజా పాలనకు దిక్సూచి వైద్యుల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు! SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ జల్ పల్లి కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలి

విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Select Suryaa Now
విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది*  – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

 

విజయనగరం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవిస్తూ, తమ కుటుంబాన్ని తామే ముందుండి నడిపించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తోందని రాష్ట్ర రాష్ట్ర ఎం ఎస్ ఎం ఇ,  సెర్ఫ్, ఎన్నారై శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, విభిన్న ప్రతిభావంతులకు భరోసా కల్పించే విధంగా పింఛన్ మొత్తాన్ని రూ.6,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10,000, పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి రూ.15,000 పింఛన్ అందిస్తున్నామని వివరించారు. విభిన్న ప్రతిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

జిల్లాలో మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల కోసం 138 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత కలిగిన 61 మందిని ఎంపిక చేసి వాహనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉంటే వారి దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వాహనాల ద్వారా చిరు వ్యాపారాలు, చిన్నపాటి ఉపాధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తమ కుటుంబాలను తామే పోషించుకునే అవకాశం లభిస్తుందన్నారు.

*మోటరైజ్డ్ వాహనాల పంపిణీ నిరంతర ప్రక్రియ*

-- జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ వాహనాలు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పింఛన్లు, సహాయక పరికరాలు, స్వయం ఉపాధి అవకాశాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయాన్ని ఉపయోగించుకొని విభిన్న ప్రతిభావంతులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు.

*విభిన్న ప్రతిభావంతులకు అనేక ప్రయోజనాలు*

-- రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గడుపుడి నారాయణస్వామి

రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గడుపుడి నారాయణస్వామి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కల్పిస్తోందన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, క్రీడలను ప్రోత్సహించడం, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీతో పాటు అనేక సంక్షేమ చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 మంది చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోందని తెలిపారు.

*విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది*

-- ఎమ్మెల్యే లోకం నాగమాధవి

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం ఉపాధి చేసుకునేందుకు అవసరమైన మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను అందించడం ద్వారా వారి జీవనోపాధికి మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, డిఆర్ఒ సిహెచ్ సత్తిబాబు,  విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎడి జి. చంద్రిక తదితరులు పాల్గొన్నారు.