BREAKING
గాంధీ ఆశయాలే ప్రజా పాలనకు దిక్సూచి వైద్యుల ముంగిటకే రిజిస్ట్రేషన్ సేవలు! SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ జల్ పల్లి కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలి

హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం

Select Suryaa Now
హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం

-యువగళంలో రైతుల కష్టాలు చూశాకే హార్టికల్చర్ హబ్ ఆలోచన

-ఇతర రాష్ట్రాలకు కాదు...ఇతర దేశాలకు కావాల్సిన వెరైటీలు పండిద్దాం

-రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి తెలిసేలా చేద్దాం

-హార్టికల్చర్ హబ్ - ఐఎస్ఎ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్

 

హైదరాబాద్ లో ఐఎస్ బి తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతుంది. ఇక్కడకు రాబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్  ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయరంగ రూపురేఖలు మార్చబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విత్తనం దగ్గర నుండి, ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వరకు ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ పండించిన పండ్ల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే మన రైతులకు లాభం వస్తుంది. హార్టికల్చర్ హబ్ లక్ష్యం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే. మనం కేవలం ఇతర రాష్ట్రాలకు కావాల్సిన వెరైటీలే కాకుండా ఇతర దేశాలకు అవసరమైన రకాల పంటలు కూడా పండించాలి. అందుకు అనుగుణంగా మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ప్రతి వెరైటీకి సంబంధించి రీసెర్చ్ జరగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.

పోరాటాలకు పుట్టినిల్లు మదనపల్లె

త్యాగానికి, పోరాటానికి పుట్టినిల్లు మదనపల్లె. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గాంధీజీ మదనపల్లెకు వచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యధిక విరాళాలు ఇచ్చింది మదనపల్లె ప్రజలు. బ్రిటిష్ వారి అరాచకానికి వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నది బీటీ కాలేజీ విద్యార్థులు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జన గణ మన గేయాన్ని బెంగాలీ నుండి ఇంగ్లీషులోకి అనువదించింది బీటీ కాలేజీలోనే. జన గణ మనకు ట్యూన్ కట్టింది కూడా మన బీటీ కాలేజీలోనే. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న పుణ్యభూమి మదనపల్లె.

రైతుల తరపున పోరాడిన గాంధీజీ

అక్టోబర్ 2 గాంధీజీ పుట్టిన రోజు. మనకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఇచ్చిన గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిద్దాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాల గురించే మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ఆయన రైతుల కోసం చేసిన పోరాటాల గురించి మనం మాట్లాడం. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, గ్రామ స్వరాజ్యం. రైతుల తరపున అనేక పోరాటాలు చేసింది గాంధీజీ. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మింది గాంధీజీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎలా బతకాలో ప్రజలకు నేర్పింది గాంధీజీ.

యువగళంలోనే మిషన్ రాయలసీమ ఆలోచన!

నేను యువగళం పాదయాత్ర ప్రారంభించిన గడ్డ రాయలసీమ గడ్డ. ఆనాడు గొడ్డలి పార్టీ వాళ్లు నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు, సోడా బాటిళ్లు, రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. అయినా రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ పాదయాత్ర చేశానంటే దానికి కారణం సీమ ప్రజలు నా పై చూపించిన ప్రేమ, అభిమానం. ప్రతి రోజూ రైతుల్ని కలిశాను, వాళ్లు పడుతున్న కష్టాలు నేరుగా చూశాను. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, అవకాడో పండిస్తున్న అనేక మంది రైతులతో మాట్లాడాను. వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను. యువగళం పాదయాత్ర 119వ రోజు 2023 జూన్ 7న  కడపలో మిషన్ రాయలసీమ ప్రకటించాను. 

హార్టికల్చర్ హబ్ కల నిజం కాబోతుంది

అందులో ప్రధానమైనది రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చడం. విత్తనం దగ్గర నుండి ప్రపంచానికి కావాల్సిన వెరైటీలు మనం పండించడమే మిషన్ రాయలసీమ లక్ష్యం. రైతుల ఆదాయం పెంచాలన్న అజెండాతో ఆనాడు మిషన్ రాయలసీమ ప్రకటించాను. ఇప్పుడు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో హార్టికల్చర్ హబ్ కల నిజం కాబోతుంది. ఒక రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు గారికి రైతు కష్టం తెలుసు. ఇప్పుడు అందరం డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం. నీటి విలువ తెలిసిన వ్యక్తి మన చంద్రబాబు గారు. అందుకే 1997 లోనే సీమకు ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశారు. ఆ బిందు సేద్యమే కరువు నేలను బంగారు భూమిగా మార్చింది. సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందించిన వ్యక్తి చంద్రబాబు గారు.

అందుకే చంద్రబాబు వాటర్ మ్యాన్

మొన్న ఒక ఇంగ్లీష్ పేపర్లో చంద్రబాబు గారి గురించి రాస్తూ వాటర్ మ్యాన్ అని రాశారు. అది చూసి గొడ్డలి పార్టీ వాళ్లు ఏడుస్తున్నారు. నేను వాళ్లని మూడు ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. సీమ రైతుకి వరంలాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసింది ఎవరు? పట్టిసీమ ప్రాజెక్టుతో ఎటువంటి ఉపయోగం లేదు అన్నది ఎవరు? పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదు - మీకు ఏం అర్థమవుతుంది అన్నది ఎవరు? గొడ్డలి పార్టీ కాదా? నీటిని దేవుడిలా - ఇరిగేషన్ ప్రాజెక్టులను దేవాలయంలా భావించేది చంద్రబాబు గారు. సీమ ప్రాజెక్టులు ప్రారంభించింది మనమే, పూర్తి చేయబోయేది మనమే. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం మన ట్రేడ్ మార్క్. ఈ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ అరటి వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఈ ప్రాజెక్టుల వల్లే కరువు నేలపై కియా కార్లను మనం తయారు చేస్తున్నాం.అందుకే ఆయన్ని అందరూ వాటర్ మ్యాన్ అంటున్నారు.

బాబు ముందుచూపుకు నిదర్శనం ఐఎస్ బి

హార్టికల్చర్ అయినా, క్వాంటం అయినా చంద్రబాబు గారు ముందుంటారు. మనం ఈ రోజు గురించి ఆలోచిస్తే... చంద్రబాబు గారు వచ్చే 20 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. దానికి ఒక ఉదాహరణే - ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దేశంలో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ పెట్టాలి అనుకున్నారు. ఆ విషయం బాబు గారికి తెలిసింది. వాళ్లు దేశం మొత్తం తిరుగుతున్నారు. హైదరాబాద్ కి రావాలనే ఆలోచనలో అసలు లేరు. కానీ ఐఎస్బీని ఏపీకి తీసుకురావాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఐఎస్బీ బోర్డుని అప్రోచ్ కాగా, వాళ్లు ఏపీ అసలు మా కన్సిడరేషన్ లోనే లేదన్నారు. అప్పుడు బాబు గారు వాళ్లని ఒకసారి హైదరాబాద్ కి రమ్మని ఆహ్వానించారు. సీఎం, మంత్రులు ఎయిర్ పోర్టుకి వెళ్లి ఆహ్వానం పలికారు. స్వయంగా సీఎం గారే ప్రజెంటేషన్ ఇచ్చారు. బొంబాయి, హైదరాబాద్, చెన్నై, కర్ణాటక అన్ని చోట్లకి వాళ్లు వెళ్లారు. ఫైనల్ గా హైదరాబాద్ నే సెలెక్ట్ చేసుకున్నారు. దట్ ఈజ్ బ్రాండ్ సీబీఎన్. ఇప్పుడు ఐఎస్బీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ స్కూల్.

చంద్రబాబుతో అంబానీలది 3తరాల అనుబంధం

చంద్రబాబు గారికి, అంబానీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం మూడు దశాబ్దాల నాటిది. ధీరూభాయ్ అంబానీ గారితో ఆయనకున్న అనేక పరిచయాల నుండి, ముఖేష్ అంబానీ గారితో ఉన్న బంధం వరకు, ఇప్పుడు అది తరువాతి తరంతో కొత్త భాగస్వామ్యంగా ఎదిగింది. ఐఎస్బీ వ్యాపార రంగానికి ప్రపంచ స్థాయి సంస్థగా ఎలా మారిందో, మీ నాయకత్వంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మన రైతుల కోసం ప్రపంచ స్థాయి సంస్థగా మారుతుంది. ఈ సంస్థను నిర్మించడానికి మీరు ఇచ్చిన కట్టుబాటుకు, అంతకంటే ముఖ్యంగా ఆంధ్రా రైతుల సామర్థ్యంపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాయలసీమ రైతును ఆంధ్రప్రదేశ్ పొలాల నుండి ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్దాం. రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి తెలిసేలా చేద్దామని మంత్రి లోకేష్ అన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి