గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన
సూర్య, పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండలంలోని రీ-సర్వే రెవెన్యూ గ్రామం గుంట్లపేట్‌లో శుక్రవారం రీ-సర్వే పనులను అధికారులు పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూముల హద్దులు, వివరాలను పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ బోడ రవీందర్, సర్వేయర్స్, జేపీఓ షారుఖ్ మరియు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.