జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం..
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 02):జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజె (ఐజెయు) కుల్కచర్ల మండల అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కుల్కచర్లలో గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ...అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని, అయినా తమకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గణేష్, విజయ్ కుమార్, రమేష్, వినోద్ కుమార్, నర్సింలు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్.