సత్యం, అహింస, సేవా మార్గంలో మనమందరం ముందుకు సాగుదాం.
సూర్య దస్తురాబాద్, నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కనక యాదవ రావు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పిన జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన సత్యం, అహింస అనే ఆయుధాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, ఆయన చూపిన సేవా మార్గంలో మనమందరం ముందుకు సాగడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ వేడుకల్లో మండల స్థాయి అధికారులు, ఆర్.ఐ సాయి, కార్యాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.