BREAKING
రేపు చేవెళ్లలో పర్యటించనున్న సబితమ్మ పట్టభద్రుల ఓటు నమోదుకు యువత ముందుకు రావాలి : మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని.

రాయలసీమను 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్ శపథం

Select Suryaa Now
రాయలసీమను 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్ శపథం

మదనపల్లి, సూర్య ప్రతినిధి :మదనపల్లెలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సీమ పౌరుషం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసని, అయితే ఇకపై రాయలసీమ రైతుల కష్టపడే తత్వం, వారి వ్యవసాయ సత్తా ఏంటో ప్రపంచమంతా చూస్తుందని స్పష్టం చేశారు.

రాయలసీమలోని ప్రతి హెక్టార్ భూమిని ఉద్యాన పంటల కేంద్రీకృతంగా మార్చి, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. సీమ నేలలో పండే మామిడి, అరటి, టమోటా, దానిమ్మ వంటి పంటలు నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు. ప్రాసెస్ యూనిట్లు, అంతర్జాతీయ మార్కెటింగ్ వసతులను కల్పించి మన రైతులు పండించిన పంటలను విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని లోకేష్ వెల్లడించారు.