జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందజేసిన APUWJ * మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించిన యూనియన్ నేతలు * పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా APUWJ ఆధ్వర్యంలో కార్యక్రమం
ధర్మవరం రూరల్ అక్టోబర్ 2 మేజర్ న్యూస్
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ APUWJ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు పుట్టపర్తిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలను యూనియన్ నాయకులు కలిసి వినతి పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మురళీకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు లెక్కల హరిలతో పాటు జిల్లా కేంద్రానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.