BREAKING
ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం సంకినేని రవీందర్ రావు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు నిరాధారం పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు సోమనాథ స్వామి యాత్రకు బయలుదేరిన 50 మంది భక్తులు జెండా ఊపి ప్రారంభించిన ఆలయ చైర్మన్ చుంచు రమేష్ నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన నేరెళ్ల బాధితులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు భోగాపురం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కదిలిన రైతాంగం జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి పెద్దేముల్ రైతు సేవ సహకార సంఘం చైర్మన్‌గా ఎల్లారెడ్డి నాటి జ్ఞాపకాలు.. నేటి ఆత్మీయత బుర్రిపాలెంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం ఏపీలో 'తల్లికి వందనం

బీసీల ప్రయోజనాలను రాజకీయాలకు వాడుకోవద్దు

Select Suryaa Now
బీసీల ప్రయోజనాలను రాజకీయాలకు వాడుకోవద్దు

బీసీల కు రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక స్వావలంబన కల్పించడమే టిడిపి లక్ష్యం. 

నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబుతోనే బీసీల అభివృద్ధి. 

 

బీసీల 34% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.

బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లింది టిడిపి నే. 

వైసీపీ హయాంలో 24 శాతానికి రిజర్వేషన్  తగ్గింపు.

బీసీల రాజకీయ సాధికారత అనేది టిడిపి సిద్ధాంతంలో భాగమే.

బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం ఎంతవరకు అయినా న్యాయపోరాటం చేస్తాం. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. 

దర్శి, మేజర్ న్యూస్: 

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తుంటే గొడ్డలి పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సంకల్పమని  డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  అన్నారు. 

 ఆమె మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేలా న్యాయపరంగా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్.105, జీవో ఆర్ టి నంబర్1065లను జారీ చేసిందని Dr గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. 

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం కేవలం రిజర్వేషన్ల అంశం కాదని, అది సామాజిక న్యాయం మరియు రాజకీయ సాధికారతకు సంబంధించిన అంశమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని, 1987లో 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లకు చర్యలు తీసుకున్న విషయాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ గుర్తు చేశారు. 

హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీలకు న్యాయం జరిగేలా తదుపరి న్యాయపరమైన మార్గాలను అనుసరిస్తామనిడాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ స్పష్టం చేశారు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అవసరమైన ప్రతి న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకుంటామని డాక్టర్ లక్ష్మి తెలిపారు.