BREAKING
ఫ్లైదుబాయ్ కో-పైలట్ ఆస్ట్రేలియా సంబంధాలపై భద్రతా దళాల దర్యాప్తు రేపు సూడేపల్లిలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి 4 కోట్లతో... 3 తారురోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హౌతీల ఆధీనంలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మోదీ అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలోకి 50 మంది చేరిక భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన హవనం క్షమాగుణమే ప్రతీకారానికి సరైన సమాధానం - ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉద్బోధ టిడిపినేత వెంగయ్యను సత్కరించిన బద్వేలు టిడిపి ఇంచార్జి ఆలయంలో నిత్యారాధనలు భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి మూడు లక్షల ఇళ్ల మంజూరుతో పాటు దేశంలోనే తొలి 3డీ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం పోలింగ్ స్టేషన్ లను పరిశీలించిన సీఐ. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఏపీలో 'తల్లికి వందనం

Select Suryaa Now
ఏపీలో 'తల్లికి వందనం

ఏపీలో 'తల్లికి వందనం

 రెండో విడతకు రంగం సిద్ధం

-సుమారు 3.29 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ

-ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం.. సీఎంవో అనుమతి కోసం నిరీక్షణ

-వచ్చే వారం లేదా రెండు వారాల్లో నిధులు విడుదలయ్యే అవకాశం

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తుది అనుమతి రావడమే మిగిలి ఉంది. సీఎంవో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిధులను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విడతలో భాగంగా అర్హులైన సుమారు 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ. 13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు, గతంలో సాంకేతిక కారణాలు, ఇతర మార్పుల వల్ల డబ్బులు అందని వారికి కూడా ఈ విడతలో నిధులు అందించనున్నారు.అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌కు ఆర్థిక శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎంవో వద్ద తుది ఆమోదం కోసం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి లభించిన వెంటనే, ఒకటి రెండు వారాల్లో లేదా వచ్చే వారంలోనే నిధులు జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో, లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందా లేదా, ఈ-కేవైసీ పూర్తయిందా అనే వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వంటివి సరిగ్గా ఉంటే నిధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో జమ అవుతాయని వారు స్పష్టం చేశారు.