BREAKING
మధ్యప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు డిసెంబర్ 31, 2029 నాటికల్లా లక్ష్యం గుజరాత్‌లో ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 20వ స్వర్ణం: రెజ్లింగ్‌లో మెరిసిన అమన్ రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ యూకే ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక కేంద్రంలో భద్రతా కలకలం 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షను ధృవీకరించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణి దాడి దేవర చుట్టమల్లే పాట మార్ఫింగ్ వివాదం.. తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జర్మనీని వేధిస్తున్న వైమర్ కాలపు ముప్పు అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. శ్రీరామ్, రంగాయణ రఘు చిత్రం ఎలా ఉందంటే? గాల్లోనే గొడ్డలితో దాడి, ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన యూఏఈ

విజయవాడలో వైభవంగా ‘పాన్ ఐఐటీ సమ్మిట్’: డ్రోన్, ఈవీ టెక్నాలజీలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

Select Suryaa Now
విజయవాడలో వైభవంగా ‘పాన్ ఐఐటీ సమ్మిట్’: డ్రోన్, ఈవీ టెక్నాలజీలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

విజయవాడ, సూర్య ప్రతినిధి:  విజయవాడలో నిర్వహించిన ‘పాన్ ఐఐటీ సమ్మిట్’ (Pan IIT Summit) కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక వినూత్న స్టాళ్లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యంగా 'ఆక్సి ఏరోస్పేస్' (Axy Aerospace) రూపొందించిన సరికొత్త డ్రోన్ టెక్నాలజీని పరిశీలించిన సీఎం, ఆ డ్రోన్‌పై తన సంతకం చేసి నిర్వాహకులను అభినందించారు.

అనంతరం పెట్రోల్ టూవీలర్లను విద్యుత్ వాహనాలుగా (EV) మార్చే సాంకేతికతకు సంబంధించిన స్టాల్‌ను సీఎం సందర్శించారు. సాధారణ వాహనాలను ఈవీలుగా కన్వర్ట్ చేసే విధానం, దానివల్ల కలిగే ఖర్చు, పర్యావరణ ప్రయోజనాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని ప్రోత్సహించేలా, ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక ఈవీ (EV) ప్రాజెక్టును ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.