BREAKING
తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం. రజినీకాంత్ సినిమాతో క్లాష్‌కు చెక్.. కొత్త తేదీని ప్రకటించిన మమ్ముట్టి, ధనుష్ ‘ఓం’ చిత్ర యూనిట్ పరిశుభ్రతతోనే ఆరోగ్యం.. ఉత్పాదకతకు బాట - స్పెషల్ క్యాంపెయిన్‌–6లో జీఎం ఎన్‌. రాధాకృష్ణ పిలుపు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు. బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం కేవలం పది నిమిషాల్లోనే ఫౌజీ అవకాశం వచ్చింది.. ప్రభాస్ తొలి చూపుపై జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు మల్బరి మొక్కల పెంపకం పై అవగాహన. చికెన్‌ వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలి మన్నారపు సిద్దేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు పారిజాతగిరిలో పవిత్రోత్సవాలు ప్రారంభం సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు దృశ్యం 3 సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన కరణ్ జోహార్.. అజయ్ దేవగన్, జైదీప్ అహ్లావత్ నటన అద్భుతం మద్దిలో విశేష పూజలు

రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

Select Suryaa Now
రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

 

                      రాయదుర్గం రూరల్ మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దాన్ని కరవు మండలంగా ప్రకటించేలా ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాల్‌రెడ్డిని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు.
అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని పంటల పరిస్థితి, వర్షపాతం, కరువు స్థితిగతులపై అధికారులతో చర్చించారు. రాయదుర్గం రూరల్ మండలంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు సాధారణంగా 311.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 144.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసిందన్నారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 53 శాతం లోటు నమోదైందన్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు వర్షపు చినుకు కూడా పడకపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండలంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, వర్షపాతం లోటు, పంటల పరిస్థితిని సమగ్రంగా వివరిస్తూ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు పంపాలని కోరారు. అవసరమైతే ఈ అంశాన్ని ఉన్నతస్థాయిలో తాను పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు రాయదుర్గం రూరల్ మండలంలోని వర్షపాతం, పంటల పరిస్థితి తదితర వివరాలతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తాజా ప్రతిపాదనలు పంపుతామని జాయింట్ డైరెక్టర్ సాల్‌రెడ్డి తెలిపారు.