మద్దిలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్మండలంలోని గురవాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఉదయం 8 గంటలకు అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.1,88,950 ఆదాయం సమకూరింది. ఆలయానికి వచ్చిన సుమారు 1,693 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం చేశారు. ఈ వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి.చందన తెలిపారు.
కెవి రమణారావు జంగారెడ్డిగూడెం,