మల్బరి మొక్కల పెంపకం పై అవగాహన.
ఉదయగిరి మేజర్ న్యూస్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో శనివారం నెల్లూరు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ మరియు సాంకేతిక అధికారి బి. వెంకటేశ్వర రెడ్డి విక్టరీ (V 1) మల్బరీ మొక్కల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థుల కు అవగాహన కల్పించారు.మల్బరీ కటింగ్స్ ని మాన్కోజెబ్ ద్రావణంలో ఆరు నుంచి ఎనిమిది గంటలు ఉంచిన తర్వాత నర్సరీని తయారు చేసుకున్న ఎడల మల్బరిని ఆశించు వేరుకుళ్ళు ఇతరత్రా తెగులు నుంచి కాపాడుకోవచ్చని అలాగే మల్బరీ నర్సరీలో పాటించాల్సిన ఇతరత్రా సాంకేతిక పద్ధతులను ప్రస్తుతం నాలుగో సంవత్సరంలో ఈ ఎల్ పి నాలుగో సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు వివరించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మల్బరీ మరియు పట్టు పరిశ్రమ యొక్క విస్తరణకు ఉన్న అవకాశాలను విద్యార్థుల కు విశ్లేషించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేషన్ రెడ్డి డాక్టర్ టి గోపికృష్ణ మరియు కళాశాల కీటక శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ ఎం కిషన్ తేజ్ పాల్గొన్నారు మరియు కళాశాల నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మల్బరీ నర్సరీ యొక్క సాంకేతిక పద్ధతులను నేర్చుకున్నారు