BREAKING
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అడవిలో తలలేని శవం.. ఊహించని ట్విస్టులతో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు  .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి  మర్పల్లిలో గంజాయి కలకలం.. అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, కాట శ్రీనివాస్ గౌడ్. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత...జెన్-జీ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుట్టినరోజున హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని అతి ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్

సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

Select Suryaa Now
సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరం

రామచంద్రపురం ;  మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రామచంద్రపురం డివిజన్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు  మాధవనేని రఘునందన్ రావు, రామచంద్రపురం డివిజన్ బీజేపీ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది.శిశిరా ఆసుపత్రి, శ్రేష్ట ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ సంబంధిత పరీక్షలు, స్క్రీనింగ్ సేవలు అందించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య సేవలు పొందేలా మహిళల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా వైద్యులు మహిళలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, క్యాన్సర్‌కు సంబంధించిన ముందస్తు లక్షణాలు, స్క్రీనింగ్ ప్రాముఖ్యత, ఆరోగ్యంపైతీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉచితంగా పరీక్షలునిర్వహించడంతో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సేవలను వినియోగించుకున్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు  గోదావరి అంజిరెడ్డి, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ సింధు మాధవనేని, డాక్టర్ అరవింద్, డాక్టర్ స్పందన నల్లగండ్ల, బీజేపీ సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి, కంజర్ల సునంద తదితరులు పాల్గొన్నారు.మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు వైద్య సేవలు మరింత చేరువవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.