BREAKING
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్ క్యాన్సర్ ఔషధాల కుంభకోణం.. ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి ఎగుమతులు, హై-ఎండ్ తయారీ రంగానికి ఊతం

ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు.

Select Suryaa Now
ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు.

 

ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం.

ఎన్ఆర్ ఈజి ఎస్ నిధులతో గ్రామంలో మౌలిక వసతుల కల్పన.


ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం రెడ్డి.

అనంతగిరి మండలం
వసంతాపురంలో 42 లక్షలతో నిర్మించిన మూడు ప్రభుత్వ భవనాలు ప్రారంభం.

కోదాడ (మేజర్ న్యూస్) కోదాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కాభవనాలు నిర్మిస్తామని దీంతో ప్రజలకు ప్రజా ప్రభుత్వం మరింత చేరువవుతుందని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం రెడ్డి అన్నారు. అనంతగిరి మండలం వసంతాపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధు లు 30 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, మహిళా శక్తి భవనాలను, అమీనాబాద్ గ్రామంలో 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనాలను పద్మావతి ఉత్తం రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రామాలలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామాలలో మాలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడంతో పాటు మహిళల అభివృద్ధి, సాధికారతకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు పంచాయతీ సేవలు మరింత సౌకర్యవంతంగా అందనున్నాయని పేర్కొన్నారు. అలాగే 10 లక్షలతో నిర్మించిన మహిళా శక్తి భవనం మహిళా సంఘాల కార్యకలాపాలు, సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు ముసుకు శ్రీనివాసరెడ్డి, కొండపల్లి వాసు, బుర పుల్లారెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, వినేపల్లి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.