జైనూర్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
సూర్య జైనూర్ ,
జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షైక్ రషీద్ ఆధ్వర్యంలో, మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జైనూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ మరియు కొమురంభీం జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ ముఖ్య అతిథులు హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాలు, సత్యం, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన మహోన్నత సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొట్నాక దౌలాత్ రావు. మండల ప్రధాన కార్యదర్శి తుమ్రం కోటేష్, మండల కార్యదర్శులు షైక్ ఇస్లాం, మడవి కృష్ణ, అడా సేడ్మా రావు, షైక్ రహీం,భూతలే కిరణ్, షైక్ అబ్బు, లక్ష్మన్ పటేల్, సయ్యద్ వసీమ్, హైమద్ ఖాన్, ముబారక్, మేశ్రం ఇంద్రు, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.