ఫెర్టిలైజర్ సేల్ పాయింట్ ప్రారంభం
సూర్య,భీమ్‌గల్:భీమ్‌గల్ మండలం
ముచ్కూర్ సొసైటీ పరిధిలోని రాహత్‌నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ సేల్ పాయింట్‌ను ప్రారంభించి రైతులకు యూరియా లోడ్‌ను విక్రయించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, వైస్ చైర్మన్ భూరెడ్డి గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ సేవలాల్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా సేల్ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.